Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి: ఎస్సై కృష్ణసాగర్

Follow Udayam on Google
Devender Bale Sep 13, 2026 7:03 PM జగిత్యాలGeneral
గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి: ఎస్సై కృష్ణసాగర్ - Udayam
గొల్లపల్లి మండలంలోని గ్రామాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆదివారం ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి నిర్వాహకులకు తెలిపారు. మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా మద్యం సేవించి గొడవలకు పాల్పడటం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం చేయరాదని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...