Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి కేసు నిందితుడిపై పీడి యాక్ట్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 7:21 PM విజయనగరంGeneral
గంజాయి కేసు నిందితుడిపై పీడి యాక్ట్  - Udayam
గంజాయి కేసుల్లో నిందితుడు మీసాల సాయి సుమంత్‌ (27) పై పీడీ యాక్ట్‌ ప్రయోగించినట్లు జిల్లా ఎస్పీ దామోదర్‌ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ అతడిపై VZM రూరల్‌, వన్‌టౌన్‌, బొండపల్లి పోలీస్‌ స్టేషన్లలో ఐదు గంజాయి కేసులు ఉన్నాయన్నారు. పీడీ యాక్ట్‌ కింద అదుపులోకి తీసుకుని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించినట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.

Comments

G
Loading comments...