Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిన్నెలకోటలో బీటీ రోడ్లకు శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 4:55 PM అల్లూరి General
గిన్నెలకోటలో బీటీ రోడ్లకు శంకుస్థాపన - Udayam
గిన్నెలకోట పంచాయతీలో రూ.9.30 లక్షలతో రెండు బీటీ రోడ్ల నిర్మాణానికి టీడీపీ నాయకులు సోమవారం శంకుస్థాపన చేశారు. గిన్నెలకోట–పిట్టలబొర్ర రహదారికి రూ.5.35 లక్షలు, గబ్బరమామిడి–తంబలం రహదారికి రూ.3.95 లక్షలు కేటాయించారు. ఈ రోడ్లతో గిరిజన గ్రామాల రవాణా సమస్యలు తీరుతాయని మండల అధ్యక్షుడు వి. కొండయ్య తెలిపారు. కార్యక్రమంలో రాజారావు, వినోద్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...