Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా 28వ వారం ‘శనివారం గుడి పిలుస్తోంది’ కార్యక్రమం

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 26, 2026 10:57 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
ఘనంగా 28వ వారం ‘శనివారం గుడి పిలుస్తోంది’ కార్యక్రమం - Udayam
పత్తికొండ, సెప్టెంబర్ 26: పట్టణంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో 28వ వారం ‘గుడి పిలుస్తోంది’ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. లాటరీలో శిరీష ఎంపిక కావడంతో చీర బహూకరించారు. అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు .

Comments

G
Loading comments...