Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్డి కోస్తుండగా పిడుగుపడి మహిళ మృతి

Follow Udayam on Google
K.Venkatesh Sep 19, 2026 9:57 PM ఖమ్మంGeneral
గడ్డి కోస్తుండగా పిడుగుపడి మహిళ మృతి - Udayam
ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. భర్తతో కలిసి పొలం వద్ద గడ్డి కోయడానికి వెళ్లిన జమాయమ్మ(50) పిడుగుపాటుకు గురయ్యారు. వెంటనే ఆమెను కల్లూరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని తక్షణ ఆర్థిక సాయం అందించాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...