వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ-ఏలూరు రోడ్డులోని డంపింగ్ యార్డు చెత్తతో నిండిపోవడంతో రెండు రోజులుగా చెత్త వాహనాలు రోడ్డుపైనే గంటల తరబడి నిలిచిపోతున్నాయి. దీంతో పరిసరాల్లో దుర్గంధం వ్యాపిస్తోంది.
యార్డులో 75 శాతం స్థలం ప్రాసెసింగ్ ఏజెన్సీకి కేటాయించగా, మిగిలిన 25 శాతం స్థలంలో రోజూ 50 టన్నుల చెత్త వేస్తున్నారు. పొక్లెయిన్ పాడవడంతో చెత్త సర్దుబాటు చేయలేకపోతున్నామని కమిషనర్ సింహాద్రి మనోహర్ తెలిపారు.
Comments
Loading comments...

