Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు: రూ. 11.55 లక్షల సరుకు సీజ్

నిహారిక రెడ్డి Jul 23, 2026 3:15 PM ఖమ్మంabout 1 hour ago
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు: రూ. 11.55 లక్షల సరుకు సీజ్ - Udayam Digital
ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ శివారులో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 11.55 లక్షల విలువైన 23 కేజీల ఎండు గంజాయి, ఆటో, రెండు బైక్‌లు, 5 ఫోన్లు, రూ. 5,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు వెంటాడి పట్టుకోగా, మరో ఇద్దరు పరారయ్యారని వెల్లడించారు.

Comments

G
Loading comments...