వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్‌లోని శ్రీ మాతా నిమిషాంబికా ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పంచముఖాలతో దవళవర్ణ అలంకరణలో అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
జ్ఞానం, సద్బుద్ధి, ఆయురారోగ్యాలు, మనశ్శాంతిని ప్రసాదించే తల్లిగా భక్తులు పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం పూజలు, మంత్రజపాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Comments
Loading comments...

