వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీనగర్‌లో 20వ వార్డు కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో కట్టమైసమ్మ జాతర ఘనంగా జరిగింది. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలతో ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
ఈ ఉత్సవాల్లో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకే వేదికపై పాల్గొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కౌన్సిలర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

