Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన్‌పల్లి రేంజర్‌ సస్పెన్షన్

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 05, 2026 7:02 AM మంచిర్యాలGeneral
ఇంధన్‌పల్లి రేంజర్‌ సస్పెన్షన్ - Udayam
మంచిర్యాల జిల్లా ఇంధన్‌పల్లి ఇన్‌ఛార్జి రేంజి అధికారి గోదరి లక్ష్మీనారాయణను అటవీ రక్షణలో నిర్లక్ష్యం ఆరోపణలతో సస్పెండ్‌ చేస్తూ కాళేశ్వరం జోన్‌ సీసీఎఫ్‌ డా. ప్రభాకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదివాసీ యువకులపై దాడి ఘటన నేపథ్యంలో తాము చేసిన పోరాటం ఫలితంగానే ఈ నిర్ణయం వచ్చిందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు.

Comments

G
Loading comments...