Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 29, 2026 7:08 PM తిరుపతిGeneral
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు - Udayam
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తయారీదారు వివరాలు, తయారీ తేదీ, గడువు తేదీ లేకుండా చిప్స్, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న దుకాణాలను గుర్తించారు. ఈ మేరకు మూడు కేసులు నమోదు చేసి, సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. లేబుల్ వివరాలు లేని ఆహార పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...