వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలో భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుతుండగా వ్యాన్ కొట్టుకుపోయి తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ఓ బాలిక ఉంది. వ్యాన్‌లో 11 మంది ఉండగా ఇద్దరు ఈదుకుంటూ బయటపడ్డారు.
సారంగ్‌పూర్ సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. ముందుకు వెళ్లొద్దని స్థానికులు, అధికారులు హెచ్చరించినా డ్రైవర్ వాగులోకి వెళ్లడంతో వ్యాన్ కొట్టుకుపోయిందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

