Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదలో చిక్కుకున్న ఏనుగులు.. రక్షించిన అధికారులు

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 10:47 AM జాతీయంGeneral
వరదలో చిక్కుకున్న ఏనుగులు.. రక్షించిన అధికారులు - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలతో కౌడియాల నది ఉద్ధృతంగా ప్రవహించడంతో ఐదు ఏనుగులు వరదలో చిక్కుకున్నాయి. మంగళవారం బహ్రాయిచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏనుగులు గిర్జాపురి బ్యారేజ్‌ వైపు కొట్టుకుపోతుండటంతో స్థానికులు అటవీశాఖకు సమాచారమిచ్చారు. అధికారులు రక్షణ చర్యలు చేపట్టి ఐదు ఏనుగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వాటిలో రెండు ఏనుగు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...