Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ నిర్మాత గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత

Follow Udayam on Google
Harika Jun 22, 2026 12:44 PM హైదరాబాద్General
సినీ నిర్మాత గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత - Udayam
సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు (72) అనారోగ్యంతో, గుండెపోటుతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. పద్మప్రియ ఆర్ట్స్‌ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించిన ఆయన, రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. కూకట్‌పల్లి వెంకట్రావునగర్‌కాలనీ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. పద్మారావు మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Comments

G
Loading comments...