Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల రవాణా ఖర్చులతో రైతులపై భారం

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 11:55 AM సూర్యాపేటGeneral
ఎరువుల రవాణా ఖర్చులతో రైతులపై భారం - Udayam
ఎరువుల రవాణా ఛార్జీలను ఇకపై పీఏసీఎస్‌లు, ఆగ్రోస్‌ కేంద్రాలే భరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. జిల్లాలో 107 పీఏసీఎస్‌లు, సుమారు 71 ఆగ్రోస్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు మార్క్‌ఫెడ్‌ భరించిన రవాణా ఖర్చులు తాజాగా సొసైటీలపై పడ్డాయి. దీంతో యూరియా బస్తాకు రూ.30–40 వరకు అదనంగా వసూలు చేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...