వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులిచ్చి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. బెంగళూరులో జరిగిన పెట్టుబడుల అవకాశాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం, తయారీ రంగాల్లో భారీ అవకాశాలున్నాయన్నారు. నవంబరు 12, 13న విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
Comments
Loading comments...

