Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా బుకింగ్ లేదు అధికారులూ లేరు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 1:34 PM రాజన్న సిరిసిల్లGeneral
యూరియా బుకింగ్ లేదు అధికారులూ లేరు - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అగ్రికల్చర్ కార్యాలయం ముందు మంగళవారం వివిధ గ్రామాలకు చెందిన రైతులు నిరసన చేపట్టారు. యూరియా సంచులు బుకింగ్ కావడం లేదని, సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వస్తే అధికారులు, సిబ్బందిలో ఎవరూ అందుబాటులో ఉండడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన సమయంలో అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...