వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలోని మోమినాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 103 మంది తెలుగు కవుల ముఖచిత్రాలతో ఉపాధ్యాయుడు సయ్యద్ షఫీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మాతృభాషపై అభిమానంతో సొంత ఖర్చుతో దీనిని నిర్వహించారు.
అన్నమయ్య నుంచి గోరటి వెంకన్న వరకు కవులు, రచయితలు, వాగ్గేయకారుల చిత్రాలను ప్రదర్శించారు. విద్యార్థుల్లో తెలుగు సాహిత్యంపై ఆసక్తి, నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యమని షఫీ తెలిపారు.
Comments
Loading comments...

