వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ మండలం పందికోన ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సమక్షంలోనే టీడీపీలో చేరారు. హరిజన బాలస్వామి, వెంకటేశు, రంగస్వామి, శేఖర్, సూరి, మద్దిలేటి, బాలరాజు, మల్లికార్జున తదితరులు టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే ఆహ్వానించి, కష్టపడుతున్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. కాలనీ సమస్యలు, మౌలిక వసతులపై కృషి చేస్తానన్నారు.
Comments
Loading comments...

