వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం పురపాలక సంఘం నూతన కమిషనర్గా బి.రాంగోపాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. గతంలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

