వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి మండలం గెడ్డపువలస సచివాలయ మహిళా పోలీస్ రమ్యారాణి ఏడాదిన్నర చంటి బిడ్డను ఎత్తుకొని విధులు నిర్వహించారు. గురువారం గరివిడిలో 46 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా, భర్త కూడా సచివాలయ ఉద్యోగి కావడంతో ఇంట్లో బిడ్డను చూసుకునే వారు లేకపోయారు.
దీంతో బిడ్డను వెంట తీసుకుని పింఛన్లు పంపిణీ చేశారు. మాతృత్వ బాధ్యతతో పాటు విధి నిర్వహణలో ఆమె చూపిన అంకితభావం పలువురి ప్రశంసలు అందుకుంది.
Comments
Loading comments...

