Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొబైల్ షాపుల్లో తనిఖీలు.. కేసుల నమోదు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 2:14 PM ఏలూరుGeneral
మొబైల్ షాపుల్లో తనిఖీలు.. కేసుల నమోదు - Udayam
ఏలూరులోని మొబైల్, సెల్‌ఫోన్ దుకాణాల్లో లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ వాసు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనల ఉల్లంఘనలపై ఏడు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. మొత్తం 12 దుకాణాలను తనిఖీ చేయగా.. ఉత్పత్తులపై ఎంఆర్‌పీ వివరాలు ప్రకటించకపోవడం, ప్రకటించిన ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయించడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. నిబంధనల మేరకు విక్రయించాలని హెచ్చరించారు.

Comments

G
Loading comments...