Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9 పతకాలతో 8వ తరగతి విద్యార్ధి సత్తా

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 2:34 PM తూర్పుగోదావరి General
 9 పతకాలతో 8వ తరగతి విద్యార్ధి సత్తా - Udayam
రాజానగరం:దివాన్‌చెరువుకు చెందిన 8వ తరగతి విద్యార్థిని లాలం లెహ్యాశ్రీ క్రీడల్లో సత్తాచాటి 9 పతకాలు సాధించింది. CISCE ఆధ్వర్యంలో హైదరాబాద్‌, రావులపాలెంలో జరిగిన రీజినల్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ పోటీల్లో అండర్‌-14 విభాగంలో ఈ ఘనత సాధించింది. రోలర్‌ స్కేటింగ్‌లో 2 స్వర్ణ, 2 రజతాలు, అథ్లెటిక్స్‌లో 3 రజత, 2 కాంస్య పతకాలు గెలుచుకుంది. ‘నా లక్ష్యం ఒలింపిక్‌ స్వర్ణ పతకమే’ అంటూ లెహ్యాశ్రీ సాధన చేస్తోంది.

Comments

G
Loading comments...