Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఎమ్‌డీకి నిలకడగా ఇన్ఫ్లో: 6.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

Follow Udayam on Google
sudheer Aug 09, 2026 10:00 AM కరీంనగర్General
ఎల్‌ఎమ్‌డీకి నిలకడగా ఇన్ఫ్లో: 6.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం - Udayam
కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ లో గడిచిన మూడు రోజుల్లో ఒక టీఎంసీ మేర నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటిమట్టం 6.5 టీఎంసీలకు చేరినట్లు ఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం మిడ్ మానేరు నుంచి 5,000 క్యూసెక్కులు, నది నుంచి 850 క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లో వస్తోంది. నీటిమట్టం పెరగడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.నిల్వ 10 టీఎంసీలకు చేరితే ఆలస్యంగా వేసిన పంటలకు సాగునీరు అందుతుందని భావిస్తున్నారు

Comments

G
Loading comments...