వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండల కేంద్రంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత కోరారు. ఈ మేరకు మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. మారుమూల గిరిజన ప్రాంత ప్రజలు న్యాయ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.
ఏటూరునాగారంలో కోర్టు ఏర్పాటైతే తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల ప్రజలకు న్యాయ సేవలు చేరువవుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

