వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ద్రోణి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఏపీలో అక్టోబర్ 19 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. గురువారం 15 జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొంది.
అక్టోబర్ 16 నుంచి 18 వరకు కోస్తా జిల్లాల్లో, 16, 17 తేదీల్లో రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30-50 కి.మీ. వేగంతో గాలులు వీచొచ్చని తెలిపింది.
Comments
Loading comments...

