వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్లో పర్సంటైల్ తగ్గించారంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న నోటీసు నకిలీదని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) స్పష్టం చేసింది. పర్సంటైల్ తగ్గింపుపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంగళవారం వెల్లడించింది.
ఎంసీసీ పేరుతో చక్కర్లు కొడుతున్న నోటీసును నమ్మవద్దని సూచించింది. తమకు ఒకే అధికారిక వెబ్సైట్ ఉందని, ఇతర సైట్లు లేవని కమిటీ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

