వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల మండలం కుశాలపురం దుర్గా మహేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు గురువారం అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
అర్చకులు కాశీభట్ల మురళీ శర్మ ఆధ్వర్యంలో అష్టోత్తర శతనామాలతో అర్చనలు, మంగళహారతులు నిర్వహించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో లలితా పారాయణం చేశారు.
Comments
Loading comments...

