Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల రథం సెంటర్లో ఘనంగా కుంకుమ పూజలు

Follow Udayam on Google
Kumar Sep 20, 2026 8:23 PM గుంటూరుGeneral
దుగ్గిరాల రథం సెంటర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల వినాయకుడి వద్ద 48వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం 100 మంది మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. అర్చకుడు శ్రీనివాస్ వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలకు తీర్థప్రసాదాలు అందజేశారు. చిలువూరులో గణపతి నిమజ్జనోత్సవం నిర్వహించారు.

Comments

G
Loading comments...