Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుద్యాలలో భూనిర్వాసితుల నుంచి పత్రాల సేకరణ

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:00 AM వికారాబాద్General
దుద్యాలలో భూనిర్వాసితుల నుంచి పత్రాల సేకరణ - Udayam
నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల నుంచి నేడు అంగీకార పత్రాలు తీసుకోనున్నట్లు తహశీల్దార్‌ కిషన్‌ నాయక్‌ తెలిపారు. హస్నాబాద్‌ పరిధిలో కెనాల్‌ నిర్మాణానికి సర్వే పూర్తయిందన్నారు. నిర్వాసిత రైతులు పాస్‌బుక్‌, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా జిరాక్స్‌లు, రెండు ఫొటోలతో ఉదయం 11 గంటలకు పంచాయతీ కార్యాలయానికి రావాలని సూచించారు.

Comments

G
Loading comments...