వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 98 అమలు చేయాలని కోరుతూ నందికొట్కూరులో ముంపు బాధితులు చేపట్టిన నిరాహార దీక్షలు 147వ రోజుకు చేరాయి. ఐదు నెలలుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
హామీలు అమలు కాకపోవడంతో 32 మంది ఆత్మహత్య చేసుకున్నారని బాధితులు పేర్కొన్నారు. ‘మా మరణాలు కూడా పాలకుల మనసు కరిగించలేవా’ అని జయన్న వాపోయారు. తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

