Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మన్నపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంప్రారంభం

Follow Udayam on Google
Surendhar Oct 01, 2026 5:29 PM నిజామాబాద్General
దమ్మన్నపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంప్రారంభం - Udayam
ధర్పల్లి దమ్మన్నపేట గ్రామంలో ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. గ్రేడ్-ఏ రకానికి రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 కనీస మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులకు ప్రభుత్వం సూచించిన రూ.500 ప్రోత్సాహకం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధాన్యంలో చెత్త, రాళ్లు, మట్టి లేకుండా శుభ్రంగా తీసుకురావాలని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...