వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి మండలంలో భారీ వర్షాల కారణంగా అక్సాయిపల్లె వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని పోలీసులు తెలిపారు. ధర్మపురి నుంచి జగిత్యాల వైపు వెళ్లే వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా రాయపట్నం-రాజారాంపల్లి మీదుగా వెళ్లాలని సూచించారు.
వాగు ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల వద్దకు వెళ్లకుండా పోలీసుల సూచనలు పాటించాలని ధర్మపురి ఎస్‌ఐ ఎం.రవీందర్ కుమార్ కోరారు.
Comments
Loading comments...
