వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఢిల్లీ హైకోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం తదితర ప్రాంతాలను పేల్చేస్తామంటూ ఈమెయిల్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఖలిస్థాన్ పేరుతో వచ్చిన సందేశంలో మధ్యాహ్నం 2.11 గంటలకు హైకోర్టును పేల్చివేస్తామని పేర్కొన్నారు.
బెదిరింపుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదని అధికారులు తెలిపారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Loading comments...

