వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో దోమల నివారణకు ఏటా రూ.10 లక్షలు వెచ్చిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. పరిస్థితి మారడం లేదని ప్రజలు వాపోతున్నారు. 61 సచివాలయాలకు గాను కేవలం 12 స్ప్రేయర్లు మాత్రమే వాడకంలో ఉండగా, ఫాగింగ్ యంత్రాలు మూలనపడ్డాయి.
కాల్వల పరిశుభ్రత కరువై దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో 2025లో 390 మలేరియా, 83 డెంగ్యూ కేసులు రాగా.. 2026లో ఇప్పటివరకు మలేరియా కేసులు 655కి చేరాయి. డెంగ్యూ 59 నమోదయ్యాయి.
Comments
Loading comments...

