వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరు మండలం ఎర్రమాడులో కొన్ని నెలలుగా వీధిలైట్లు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరువూరు-ఎర్రమాడు-ఊటుకూరు ప్రధాన రహదారిపై రాత్రివేళ చీకటితో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
గ్రామంలోని పలుచోట్ల ఇదే పరిస్థితి ఉన్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీధిలైట్లకు వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

