వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్డీఎస్ ప్యాకేజీ 1, 2 పనులను 2018 నుంచి ఎందుకు పెండింగ్‌లో పెట్టారని కర్ణాటక అధికారులను సీడబ్ల్యూసీ సభ్యుడు యోగేశ్ ప్రశ్నించారు. ఆనకట్ట ఎత్తుపెంపు, పటిష్ఠ పనుల అడ్డంకులపై వివరణ కోరారు.
అనుమతులు లేకుండా కుడికాలువ నిర్మిస్తున్న ఏపీ అధికారులపైనా ఆగ్రహం వ్యక్తంచేశారు. కేడబ్ల్యూడీటీ-2 అవార్డు అమలుకాకముందే పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ, అనుమతులు వచ్చేవరకు నిలిపివేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

