వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని టూటౌన్ సీఐ బి. అప్పలనాయుడు సూచించారు. స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో శనివారం మండపాల నిర్వహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా నిర్వాహకులను ఉద్దేశించి సీఐ అప్పల నాయుడు మాట్లాడుతూ ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా ప్రభుత్వ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని, ఊరేగింపు, నిమజ్జన రూట్ మ్యాప్ ను ముందుగానే పోలీసులకు అందించాలన్నారు.
Comments
Loading comments...

