Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయికి బదులు దగ్గు మందు దందా

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 05, 2026 2:55 PM సూర్యాపేటGeneral
గంజాయికి బదులు దగ్గు మందు దందా - Udayam
కోదాడ డివిజన్‌లో గంజాయి సరఫరా తగ్గడంతో మత్తు దందా ముఠాలు దగ్గు మందు విక్రయాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇటీవల గంజాయి, దగ్గు మందు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. డివిజన్‌ వ్యాప్తంగా మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిఘా పెంచామని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల సరఫరా, విక్రయాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...