Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధిలో భారీ వర్షం.. జనజీవనానికి ఆటంకం

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 12:31 PM అల్లూరి General
జీకేవీధిలో భారీ వర్షం.. జనజీవనానికి ఆటంకం - Udayam
జీకేవీధి మండలంలో మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో నాలుగు రోజులుగా జల్లులు కురుస్తుండగా, ప్రస్తుతం తెరపి లేకుండా వర్షం పడుతోంది. వర్షానికి రోడ్లపై నీరు ప్రవహిస్తుండగా, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. మరోవైపు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు మరియు పనులు చేస్తున్నారు.

Comments

G
Loading comments...