వార్తలకు తిరిగి వెళ్లండి

వన మహోత్సవంలో వనపర్తి జిల్లాకు నిర్దేశించిన 17 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ ఆదేశించారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈనెల 25న భారీగా మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. ఇప్పటివరకు 70 శాతం లక్ష్యం పూర్తయిందని, మిగిలిన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

