వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 5న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనున్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పారదర్శక ఆన్‌లైన్ ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల సేవలను ఈ సందర్భంగా గౌరవించనున్నారు. వారి కృషిపై షార్ట్ డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నారు.
Comments
Loading comments...

