Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖర్గేను అవమానించారంటూ కాంగ్రెస్‌ ఆందోళన

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 14, 2026 6:12 PM ఆదిలాబాద్General
ఖర్గేను అవమానించారంటూ కాంగ్రెస్‌ ఆందోళన - Udayam
ఖర్గేను భాజపా నేతలు అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం ఆదిలాబాద్‌లో పాదయాత్ర చేపట్టారు. అంబేడ్కర్‌ కూడలి వద్ద నోటికి నల్లగుడ్డలు కట్టుకుని సత్యాగ్రహ దీక్ష చేశారు. ఖర్గే ప్రసంగించిన వేదికను భాజపా నేతలు శుద్ధి చేయడం అంటరానితనం, అవమానకరమని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌ ఖండించారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...