Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 10, 2026 3:40 PM విజయవాడGeneral
మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు - Udayam
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఉపా (UAPA) చట్టాన్ని 'ఉప్మా చట్టం' అంటూ హేళన చేశారని, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉమ్మడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల యూట్యూబర్ రావణ్ అరెస్టు అంశంపై, అలాగే ప్రభుత్వంపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.

Comments

G
Loading comments...