వార్తలకు తిరిగి వెళ్లండి

బంటుమిల్లి మండలం మల్లపరాజుగూడెం పంచాయతీ సరఫరా చేస్తున్న తాగునీరు రంగు మారి దుర్వాసన వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.
తాగడానికి, వాడుకోవడానికి కూడా పనికిరాని ఇలాంటి నీటిని వదిలి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఆధునిక పద్ధతులతో రక్షిత మంచినీరు అందించాలని కోరారు.
Comments
Loading comments...

