Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గురుకులంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 14, 2026 5:31 PM నారాయణపేటGeneral
గిరిజన గురుకులంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ - Udayam
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్‌ గిరిజన గురుకులాన్ని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నీట్‌, జేఈఈ మెయిన్స్‌పై అవగాహన కల్పించారు. అనంతరం భోజనశాలను తనిఖీ చేసి వంటల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...