Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌ ప్రజా వేదికలో 145 అర్జీలు

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 7:01 PM బాపట్లGeneral
కలెక్టరేట్‌ ప్రజా వేదికలో 145 అర్జీలు - Udayam
జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 145 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన వినతులను ఆయన స్వయంగా స్వీకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...