వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) భవనం శిథిలావస్థకు చేరుకుంది. గోడలకు భారీగా నెర్రలు ఏర్పడి, పలుచోట్ల శిథిలాలు కనిపిస్తుండటంతో సిబ్బంది, రైతులు ఆందోళన చెందుతున్నారు.
భవనం ఎప్పుడు కూలుతుందోనని భయపడుతున్నామని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
Comments
Loading comments...

