వార్తలకు తిరిగి వెళ్లండి

మల్దకల్ మండలం పాలవాయి గ్రామంలో దేవీ శరన్నవరాత్రి రెండో రోజు వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి ధరూర్ గ్రామానికి చెందిన చిన్నారులు ప్రదర్శించిన గోకుల కృష్ణ జంట కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
చిన్నారుల ప్రతిభను చూసి గ్రామస్తులు మురిసిపోయారు. ఇలాంటి సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని గ్రామ పెద్దలు కోరారు. వేడుకల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

