వార్తలకు తిరిగి వెళ్లండి
కిర్లంపూడి(M) చిల్లంగి భావి చెరువు వద్ద శుక్రవారం తెల్లవారుజామున కాల్వలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం ఏలేశ్వరానికి చెందిన చేవూరి నూకరాజు(43) బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయాడు.
కిర్లంపూడిలో కాగితాలు, వాటర్ బాటిళ్లు ఏరుకునేవాడని, ఇతడికి మూర్ఛవ్యాధి వచ్చేదని కూడా తెలిపారు. మృతదేహాన్ని ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

